Anasuya : టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాతో ఆమె స్థాయి ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. తాజాగా పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అనసూయ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాకు అనసూయ ఆ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుష్ప సినిమాలో నెగెటివ్ షేడ్‌లో కనిపించేందుకు అనసూయ ఒక్కరోజుకే రూ. 1 లక్ష నుంచి రూ.1.50 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. తొలి పార్ట్‌లో అంతగా అలరించని అనసూయ సెకండ్ పార్ట్‌లో మాత్రం అదరగొడుతుందని తెలుస్తోంది.
అనసూయ భరద్వాజ్ పుష్ప రెండవ భాగంలో కూడా దాక్షాయనిగా మరింత భీభత్సంగా కనిపించనున్నట్లు సమాచారం. సునీల్ క్యారెక్టర్ కు సతీమణిగా అనసూయ పాత్ర రెండవ భాగంలో ఇంకా అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఖిలాడీ చిత్రంలో నటించిన అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తాండ అనే సినిమా కూడా చేస్తోంది. అలాగే మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వస్తుండడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…