Maldives : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్తున్నారు. కరోనా నేపథ్యంలో అనేక దేశాల్లో కోవిడ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. దీంతో చాలా మంది మాల్దీవ్స్‌కు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక జంటలు కూడా హనీమూన్ కోసం మాల్దీవ్స్‌నే ఎంచుకుంటున్నాయి. అయితే మాల్దీవ్స్‌కు వెళ్లి వచ్చేందుకు ఒకరికి ఖర్చు ఎంతవుతుంది ? వీసా ఎలా ఇస్తారు ? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాల్దీవ్స్‌కు వెళ్లి వచ్చేందుకు అనేక ట్రావెల్ ఏజెన్సీలు ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంత లేదనుకున్నా కనీసం ఒక్క వ్యక్తికి 3 రాత్రుల వెకేషన్‌కు గాను రూ.55వేల వరకు అవుతుంది. ఇది కనీస ఖర్చు. అక్కడ ఇంకా ఏవైనా స్థలాలకు వెళ్లి చూడాలనుకుంటే ఇంకాస్త ఎక్కువే అవుతుంది. అక్కడి హోటల్స్, అందించే సదుపాయాలు, భోజన ఖర్చులు, ఇతర అంశాల ఆధారంగా ఈ టూర్ ప్యాకేజీ మారుతుంది. టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి భోజన సదుపాయాలు, ఎయిర్ పోర్టు నుంచి పికప్, డ్రాపింగ్, సైట్ సీయింగ్.. వంటి ఖర్చులు అందులోనే ఉంటాయి. కనుక టూర్ బుక్ చేసుకునేటప్పుడే ట్రావెల్ ఏజెన్సీల వద్ద ఈ వివరాలను కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. లేదంటే తీరా టూర్ వెళ్లాక అదనపు చార్జిలను చెల్లించాల్సి రావచ్చు.
ఇక మాల్దీవ్స్‌కు వెళ్లేందుకు ముందుగానే వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్టు, రాను, పోను విమాన టిక్కెట్లు, హోటల్ రిజర్వేషన్ వివరాలు, ఎన్ని రోజులు ఉంటారు.. అనే వివరాలను అక్కడ సమర్పిస్తే.. ఎయిర్‌పోర్టులోనే 30 రోజుల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ పేరిట టూరిస్టు వీసా ఇస్తారు. అవసరం అనుకుంటే దాన్ని పొడిగించుకోవచ్చు.
ఇక మాల్దీవ్స్‌లో టూరిస్టు వీసా ఉచితంగానే ఇస్తారు. ఎలాంటి చార్జిలను చెల్లించాల్సిన పనిలేదు. అలాగే అక్కడ ఉన్నన్ని రోజులు రోజుకు 150 డాలర్లు అంటే దాదాపుగా రూ.11వేల చొప్పున చేతిలో ఉండాలి. అంటే.. ఒక వ్యక్తి అక్కడ 3 రోజుల పాటు ఉండదలిస్తే.. టూర్ ప్లాన్ ఆ విధంగా బుక్ చేసుకుని ఉంటే అతని చేతిలో 3 రోజులకు కలిపి రూ.33వేలకు పైన డబ్బులు ఉండాలి. ఆ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే వీసా జారీ చేస్తారు. ఈ విధంగా మాల్దీవ్స్‌కు చాలా సులభంగా వెళ్లి రావచ్చు.
అక్కడ అనేక చిన్న చిన్న దీవులు ఉంటాయి. మధ్యలో హోటల్స్, రిసార్టులు ఉంటాయి. ఒక్కో చోట ఉండే సదుపాయాలను బట్టి చార్జిలు ఉంటాయి. ఆ వివరాలను ట్రావెల్ ఏజెన్సీలతో ముందుగానే మాట్లాడుకోవాలి. సముద్రంలో చిన్న చిన్న ఇళ్లలాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిల్లో ఉంటూ చుట్టూ ఉండే సముద్రపు అందాలను వీక్షించవచ్చు. ఆ దృశ్యాలను తలచుకుంటేనే మనస్సుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అందుకనే చాలా మంది మాల్దీవ్స్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇతర దేశాలతో పోలిస్తే అక్కడకు వెళ్లేందుకు ఖర్చు కూడా తక్కువే. కనుక చాలా మంది అక్కడ విహరించేందుకు వెళ్తున్నారు. మరి మీకు కూడా స్థోమత ఉంటే.. సులభంగానే అక్కడికి వెళ్లి రావచ్చు..!
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…