Gangavva : గంగ‌వ్వ నెల‌కు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Gangavva : పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది గంగవ్వ. మై విలేజ్ షోతో గంగవ్వను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశాడు శ్రీకాంత్ శ్రీరామ్. ఈ షోలో గంగవ్వ నటన చాలా అద్భుతంగా, సహజంగా ఉంటుంది. ఆమెకు మొదట అసలు నటించడమే తెలియదు. శ్రీకాంత్ ఎలా చెప్తే అలాగే ఆమె చేసి చూపిస్తుంది. గంగవ్వ నిజ జీవితంలో ఎలా అయితే ఉంటుందో అలాగే వీడియోలో కూడా కనిపించడం వల్ల ఆమెకు యూట్యూబ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది గంగవ్వ. కానీ గంగవ్వ పెద్ద వయసు కారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.

బిగ్ బాస్ షోలో నాగార్జున కూడా గంగవ్వకు బాగా సపోర్ట్ చేశారు. ఆమె అమాయకమైన పల్లెటూరి మాటలకు ఎంతో ఆనందంగా నవ్వుకునేవారు నాగార్జున. బిగ్ బాస్ షోలో వచ్చిన రెమ్యూనరేషన్ తో గంగవ్వ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో నాగార్జున కూడా ఆర్థిక సహాయం అందించారు. ఇక ఆ తర్వాత గంగవ్వ యూట్యూబ్ లో సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాకుండా మధ్యమధ్యలో సినిమాల్లో కూడా కనిపించింది గంగవ్వ.

Gangavva

ప్రస్తుతం గంగవ్వ యూట్యూబ్ ఛానల్ లో రెగ్యులర్ గా తన వీడియోలను పోస్ట్ చేస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటుంది. ప్రేక్షకులకు చేరువగా ఉంటూ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో పాటు తన సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేసుకున్న గంగవ్వ ప్రస్తుతం నెలకు బాగానే సంపాదిస్తుందట. యూట్యూబ్ ఛానల్ లోకి రాకముందు కూలి పనులు చేసుకుని బతికిన గంగవ్వ ఇప్పుడు నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని అందుకుంటుంది. ప్రస్తుతానికి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న గంగవ్వ భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Share
Mounika

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM