Bhallala Deva : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన విజువల్ వండర్ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ చిత్రం అందరినీ అలరించింది. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం యావద్భారతాన్నీ అలరించింది. అయితే బాహుబలి-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. ఇక అప్పటి నుండి సెకండ్ పార్ట్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
అనేక అంచనాల నడుమ బాహుబలి-2 మూవీ 2017 ఏప్రిల్ 28న విడుదలయింది. అనూహ్య విజయం సాధించింది. భారతదేశంలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా చరిత్రలో నిలిచింది. తెలుగులో రూపొంది.. తమిళ, మళయాళ, హిందీ భాషల్లోకి అనువాదమైన బాహుబలి 2 కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించి అందరి దృష్టినీ టాలీవుడ్‌పై పడేలా చేసింది. బాహుబలి 2 అప్పుడే రూ.1600 కోట్లుకుపైగా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది రిలీజ్ అయితే మినిమం రూ.2 వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే బాహుబలి చిత్రంలో రానా భళ్లాల దేవుడిగా కనిపించాడు. బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ భళ్లాలదేవుడిగా కనిపించాడు. అయితే సెకండ్ పార్ట్‌లో ఆయన ముఖంపై గీత ఉంటుంది. అది ఎందుకు వచ్చిందనే విషయం బాహుబలి అభిమానులకి ఎవరికైనా గుర్తుందా ? ఆ గీతని భళ్లాలదేవుడు తనకు తానే పెట్టుకుంటాడు. కుమార వర్మ తనకు హాని కలిగించడానికి వచ్చినట్టు అందరినీ నమ్మించడానికి పెట్టుకుంటాడు. ఈ గీత ఎక్కడా మిస్ కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తపడ్డాడు. అందుకనే మూవీ చాలా చోట్ల రానా ముఖంపై మనకు ఆ గీత కనిపిస్తుంది. సినిమాలో చిన్న చిన్న అంశాలపై కూడా రాజమౌళి ఎంత జాగ్రత్త వహిస్తాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక రాజమౌళి త్వరలోనే మహేష్ తో సినిమా చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…