Suman : న‌టుడు సుమ‌న్ భార్య బ్యాక్‌గ్రౌండ్‌.. ఏంటో తెలిస్తే.. షాక‌వుతారు..!

Suman : కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. సుమన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై స్టార్ హీరోగా ఎదిగారు. చూడచక్కని రూపం.. ఆరడుగుల అందగాడు.. అచ్చ తెలుగు అబ్బాయిలా ఉండే సుమన్ కి అప్పట్లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. హీరో, సహాయ నటుడు, విలన్ ఇలా ఏ పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి నటించే అరుదైన నటులలో సుమన్ ఒకరు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో నటించిన సుమన్ తర్వాత కొంతకాలం కొన్ని కారణాల‌ వలన సినిమాలకు దూరం అయ్యారు.

ఆయనకు కెరియర్లో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలు చాలానే ఉన్నాయి. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి, రామదాసు సినిమాలో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు సుమన్. 1980 దశాబ్దంలో  సుమ‌న్ టాలీవుడ్ లో చిరంజీవికి పోటీ ఇచ్చారు అంటే ఆయ‌న రేంజ్ ఎంటో అర్థం చేసుకోవ‌చ్చు. యాక్ష‌న్ సినిమాల‌తో పాటూ కుటుంబ క‌థా చిత్రాల‌తో సుమ‌న్ ప్రేక్ష‌కుల‌కు ఎంతగానో ద‌గ్గ‌ర‌య్యారు. త‌రంగిణి సినిమాతో తెలుగులో అడుగుపెట్టి న‌ట‌న‌పరంగా ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నారు.  హీరోగా మంచి స్థాయిలో ఉన్న టైంలో కొన్ని కారణాల వల్ల ఆయన జైలుకు వెళ్లవలసి వచ్చింది.

Suman

సుమ‌న్ జైలు జీవితం గ‌డ‌ప‌డం వెన‌క ఓ రాజ‌కీయ కుట్ర ఉంద‌ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో ద్వారా తెలిపారు. రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన సుమన్ మానసికంగా కుంగిపోయారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. సుమ‌న్ జైలు జీవితం గ‌డిపిన త‌ర‌వాత కూడా టాలీవుడ్ లెజండ‌రీ రైట‌ర్ బ‌స‌వ‌రాజు త‌న మ‌న‌వ‌రాలు శిరీషను ఇచ్చి వివాహం జ‌రిపించారు. అప్పట్లో ఈ విషయం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుమ‌న్ నిర్దోషి కాబ‌ట్టే బ‌స‌వ‌రాజు త‌న మ‌న‌వ‌రాలు శిరీషతో వివాహం జ‌రిపించార‌ని అంతా అనుకున్నారు.

పెళ్లి త‌రువాత సుమ‌న్ జీవితం మ‌ళ్లీ దారిలోకి వచ్చింది. పెళ్లి త‌రువాత సుమ‌న్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బావ‌బావ‌మ‌రిది, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, పెద్దింటి అల్లుడు సినిమాల‌తో సూప‌ర్ హిట్స్ అందుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా  సుమన్ తన భార్య చాలా మంచిదని, ఆమె వల్లే మరలా తిరిగి సినిమా ఇండస్ట్రీలో పోయిన తన గౌరవాన్ని తిరిగి దక్కించుకున్నాన‌ని సుమన్ తెలియజేశారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM