Acharya Child Artist : మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక చిరంజీవి, చెర్రీలు ఒకే స్ర్కీన్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆచార్య సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా మణిశర్మ అందించిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్ గా నటించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. తొలిసారి కెరీర్ లో అపజయం మూట కట్టుకున్నాడు కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ.
అయితే ఈ సినిమాలో కనిపించిన ఓ ఛైల్డ్ ఆర్టిస్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ బాలుడి పేరు మిథున్ శ్రేయాష్. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడే ఈ మిథున్. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా మెగాస్టర్ చిరంజీవి సినిమాలో తన మనవడు నటించడం పట్ల సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు డాక్టర్ సదానందం.
ఆచార్య మూవీలో ఛైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారని శ్రీధర్ మిత్రుడు విజయ్‌కుమార్ మా దృష్టికి తీసుకొచ్చారు. మాకు తెలిసిన వారి ద్వారా మా మనవడిని సినిమా వాళ్లకి పరిచయం చేశాం. ఆడిషన్‌లో బాగా డైలాగ్‌లు చెప్పడంతో సినిమాకు ఎంపిక చేశారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. చిరంజీవి సినిమాలో నా మనవడు నటించడం ఎంతో సంతోషంగా ఉందని సదానందం చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భాగమైనందుకు గాను పట్టణంలోని ప్రైవేట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మిథున్‌ని అభినందించారు. ఆచార్యలో అభినయంతో ఆకట్టుకున్న మిథున్ ముందు ముందు మరిన్ని సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటాడేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…