kiara advani : స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈమెకు రూ.12 కోట్ల మేర భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలో నిర్మించబోయే మూడు సినిమాలకు గాను గంప గుత్తగా మొత్తం రూ.12 కోట్లతో కియారా అద్వానీకి భారీ ఆఫర్‌ను ఇచ్చారని టాక్ వినిసిస్తోంది.
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కియారా అద్వానీ ఇప్పటికే నటిస్తోంది. అయితే తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపైల్లిల కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ మూవీని త్వరలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి గాను కియారాను తీసుకోవాలని దిల్ రాజు అనుకున్నారట.
అయితే దిల్ రాజు నిర్మాణంలో ఇంకో రెండు మూవీలను కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో విజయ్ సినిమాతోపాటు మరో రెండు మూవీలకు.. మొత్తం 3 మూవీలకు గంప గుత్తగా రూ.12 కోట్లకు కియారాకు దిల్ రాజు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు కియారా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈమె త్వరలో వరుసగా మూడు సినిమాల్లో కనిపించే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.