BCCI : ఇదేమిటి అధ్యక్షా..? బీసీసీఐపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీ ఎత్తున ట్రోలింగ్‌..!

BCCI : భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్‌ జరిగిన విషయం విదితమే. అయితే తొలి నాలుగు టీ20 మ్యాచ్‌లలో చెరో రెండు చొప్పున గెలిచిన ఈ జట్లు చివరి మ్యాచ్‌లో ట్రోఫీ కోసం తలపడ్డాయి. కానీ వరుణ దేవుడు ఆద్యంతం మ్యాచ్‌కు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు ట్రోఫీని పంచారు. ఇరు జట్లను సిరీస్‌కు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడం.. దీంతో ఫ్యాన్స్‌ అసంతృప్తి చెందడం సహజమే. క్రికెట్‌ మ్యాచ్‌లు అన్నాక వర్షం పడ్డప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. ఇది ఫ్యాన్స్‌కు అనుభవమే. కానీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులకు మాత్రం ఊహించని షాక్‌ తగిలింది.

మ్యాచ్‌ సందర్భంగా వర్షం పడడంతో స్టేడియం పైకప్పు నుంచి నీరు లీకై కింద గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల మీద వర్షం పడింది. భారీ ఎత్తున నీరు లీకైంది. దీంతో స్టేడియంలో అసలు కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్‌ ఈ సంఘటనకు చెందిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. బీసీసీఐని భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. అలాగే కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను కూడా నిందిస్తున్నారు.

BCCI

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా చెప్పుకునే బీసీసీఐ స్టేడియంలలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదా.. ఇంతకన్నా దారుణమైన వైఫల్యం మరొకటి ఉండదు.. ఇలాగైతే ఫ్యాన్స్‌ క్రికెట్‌ను ఎలా చూసి ఎంజాయ్‌ చేస్తారు.. ఇది చాలా దారుణమైన అనుభవం.. భారీ ఎత్తున నిధులు ఉన్నప్పటికీ దేశంలో స్టేడియంలలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయని.. ఫ్యాన్స్‌కు మంచి క్రికెట్‌ వీక్షణ అనుభవం ఇవ్వాలన్న జ్ఞానం బీసీసీఐకి లేదని.. ఇకనైనా స్టేడియంలలో అద్భుతమైన క్రికెట్‌ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ వచ్చేలా సదుపాయాలను కల్పించాలని.. భారీ ఎత్తున స్టేడియంలలో మరమ్మత్తులు చేయాలని.. ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐతోపాటు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

అయితే ఈ మధ్యే ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం వచ్చింది. రూ.48,340 కోట్ల మేర ఆదాయం లభించింది. దీంతో ఆ మొత్తాన్ని దేశంలోని స్టేడియంలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తామని.. అలాగే కొత్త స్టేడియంల నిర్మాణం కూడా చేపడుతామని.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. అయితే బెంగళూరు స్టేడియంలో పైకప్పు నుంచి వర్షం నీరు లీకైన వార్త, ఆ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM