Bigg Boss : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా మరో కొత్త సీజన్ సెప్టెంబర్ 4న మొత్తం 21 మంది కంటెస్టెంట్లతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ ఎవరూ లేకపోవడం.. బిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం నడిపించడం, ఒక్కొక్క అమ్మాయి చడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతూ సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్‌బాస్ పై సంచనల కామెంట్స్ చేశారు.
దీని గురించి మాట్లాడుతూ.. కాసులకు కక్కుర్తి పడేవాళ్లు ఉన్నంత కాలం బిగ్‌బాస్‌లాంటి షోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అసలు ఈ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలి. బిగ్‌బాస్ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా ? బిగ్‌బాస్ అనేది ఒక అనైతిక షో. వింత జంతువులు ఈ హౌజ్‌లోకి వచ్చాయి అంటూ ఘాటుగా విమర్శించారు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈయన మాటలపై ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…