Corona : గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ కరోనా మహమ్మారి గజగజలాడించింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాలు ఇలాంటి వైరస్ లను తట్టుకొని వాటితో సహజీవనం చేస్తున్నాయని, ఇలాంటి జంతువులు, పక్షులు మనుషులకు దగ్గరగా ఉన్నప్పుడు.. అలాంటి వైరస్ లు మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.
ఈ క్రమంలోనే ఏదైనా ఒక వైరస్ ఒక జంతువు పై అధిక సార్లు దాడి చేసినప్పుడు ఆ వైరస్ దాడిని తట్టుకొని వాటితో సహజీవనం చేసే విధంగా తమ శరీరాన్ని మార్చుకుంటాయి . ఇలా ఎలుకలలో ఎన్నో రకాల వైరస్‌లు వ్యాప్తి చెందినప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగలేదని, ఆ వైరస్ లకి అనుగుణంగా ఎలుకల శరీరంలో ఏసీఈ–2 రిసెప్టార్లు వృద్ధి చెందినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయంగా మారాయి. ఇదిలా ఉండగా ఫ్యూచర్ లో ఎలుకల నుంచి మనుషులకు ఇలాంటి వైరస్ లు సంక్రమించే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు. అయితే మనుషులలో కూడా ఇలా ఎన్నో రకాల వైరస్‌లు నివసించాయని వాటికి అనుగుణంగా మన శరీరం మారిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగా మారిపోతుందని.. ఈ సందర్భంగా తెలిపారు.