CM YS Jagan : అధికారంలో ఉండగానే సరిపోదు, ఓ వైపు ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడుతూనే మరోవైపు అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఇంకో వైపు పార్టీని బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికలకు నేతలను సిద్ధం చేయాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలి. అందుకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అవును.. సీఎం జగన్ కూడా సరిగ్గా ఇలాగే చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన సంచలన నిర్ణయాలను తీసుకోనున్నట్లు సమాచారం.
సీఎంగా ప్రమాణం చేసినప్పుడే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారు. దీంతో ఆ సమయం ఆసన్నమవుతుండడంతో.. జగన్ ఆ దిశగా చర్యలకు పూనుకుంటున్నట్లు సమాచారం. డిసెంబర్ వరకు కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పాత మంత్రుల్లో 90 శాతం మందిని తీసేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. కొత్త మంత్రులకు ఎంపీలను గెలిపించుకునే బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం.
ఇక పదవులను కోల్పోయిన వారికి పార్టీలో క్రియాశీలంగా పనిచేయాలని ఇప్పటికే జగన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో పాత మంత్రులు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీలతో దీనిపై చర్చించినట్లు సమాచారం. వారి సూచనల మేరకే కొత్త మంత్రులను జగన్ ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా జగన్ మంత్రి వర్గంలో మార్పులు చేయడం ద్వారా 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి వర్గంలో మార్పులపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో కొందరు నేతల మధ్య దూరం పెరగడంతో వారి మధ్య సఖ్యతను పెంచేందుకు కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో మార్పులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…