Hyper Aadi : బుల్లితెరపై పలు టీవీ షోల ద్వారా హైపర్ ఆది ఎలా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ వేదికపై ఆది చేసే హంగామ అంతా ఇంతా కాదు. అయితే ఈ షోలో గత కొద్ది రోజులుగా ఆది కనిపించడం లేదు. కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోనే కనిపిస్తున్నాడు. అయితే గతంలో జబర్దస్త్ వేదికపై పలువురు అగ్ర హీరోలు, రాజకీయ నాయకులను మిమిక్రీ చేస్తూ కొందరు చేసిన స్కిట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో అప్పట్లో పలువురు జబర్దస్త్ కమెడియన్లు ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. అయితే ఆ విషయాన్ని మరిచిపోయాడో ఏమో తెలియదు కానీ.. హైపర్ ఆది కూడా తాజాగా మళ్లీ అలాంటి తప్పే చేశాడు. సీఎం వైఎస్ జగన్‌ను అనుకరించి స్కిట్ చేశాడు. అయితే అది బోల్తాకొట్టింది. అది ఆదికే రివర్స్‌లో తగిలింది. దీంతో ఆదిని అటు వైసీపీ ఫ్యాన్స్, ఇటు సీఎం జగన్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆది ఏకంగా చనిపోయాడని పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సీఎం జగన్ 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే పదాలను బాగా వాడారు. అయితే కేవలం పదాలను మాత్రమే కాదు.. ఆయన చేసిన పాదయాత్ర.. ఇచ్చిన హామీలు నచ్చి జనం ఆయనను సీఎంను చేశారు. అయితే ఇటీవల సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ కూడా అవే డైలాగ్స్‌ను వాడారు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ మహేష్‌ను మెచ్చుకున్నారు. అయితే ఆ డైలాగ్‌లను సీరియస్‌గా వాడాలి కానీ.. కామెడీ కోసం వాడకూడదు. ఆ విషయం కూడా తెలియకుండా హైపర్ ఆది.. తాజాగా విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఇవే డైలాగ్‌లను వాడాడు.
మేము ఉన్నాం.. అని ఒక యువకుడు ఈ ప్రోమోలో అనగా.. ఇంకొక యువకుడు మేము విన్నాం అంటాడు. దీంతో హైపర్ ఆది.. సరే మేము ఉంటాం.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా డైలాగ్‌లు చెప్పడంతో ఆదిపై వైసీపీ ఫ్యాన్స్, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆదిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆదిపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆది ఏకంగా చనిపోయాడని పోస్టులు పెడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆది స్పందించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…