CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తారని తెలుస్తోంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక ఆ సమయంలో ఎమ్మెల్యే సీటుకు కచ్చితంగా పోటీ చేస్తారు. అయితే 2024లో ఎంపీ సీటుకు పోటీ చేసే విషయమై మరికొద్ది నెలల్లో స్పష్టత రానుంది.
రానున్న 2, 3 నెలల్లో దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. అది చాలా పెద్ద రాష్ట్రం. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అక్కడి బీజేపీ ప్రభుత్వానికి చావో రేవో అన్నట్లుగా మారాయి. యూపీలో గెలిస్తే దేశంలో అధికారం మళ్లీ బీజేపీదేనని విశ్లేషకులు అంటున్నారు. గతంలోనూ అక్కడి ఎంపీ సీట్లే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో కీలకంగా మారాయి. అందువల్ల బీజేపీకి యూపీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఈ క్రమంలో అక్కడ ఓడిపోతే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అంటే బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు భావించాలి.
యూపీలో గనుక బీజేపీ ఓడిపోతే అప్పుడు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటుకు పోటీ చేస్తారు. యూపీలో బీజేపీ ఓడితే దేశంలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నట్లు అర్థం చేసుకుంటారు. కనుక బీజేపీని ఓడించేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు అవకాశం ఉంటుంది. కనుకనే యూపీ ఎన్నికలు కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపైనే సీఎం కేసీఆర్ తాను ఎంపీ సీటుకు పోటీ చేసేది, లేనిదీ.. నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక ఇదే విషయమై తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చిన్న చిన్న హింట్లు కూడా ఇచ్చారు. అవసరం ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని, కేంద్రంపై పోరాడుతామని అన్నారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కనుక వాటిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎంపీ స్థానానికి తాను గతంలో పోటీ చేసి గెలిచానని, ఎంపీగా పనిచేశానని.. భవిష్యత్తులోనూ ఎంపీ సీటుకు పోటీ చేయవచ్చని అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తూనే దేశానికి ప్రధాని అయ్యారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అంటే యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు లేదా ఓటమిపై సీఎం కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికను నిర్దేశించుకుంటారని స్పష్టమవుతోంది. అయితే ఇప్పట్లో తాను సీఎంగా రిజైన్ చేసి మంత్రి కేటీఆర్‌ను సీఎంను చేసే అవకాశాలు లేవని స్పష్టమైంది. కానీ యూపీ ఎన్నికల్లో ఓడితే.. అప్పుడు ఈ విషయం సీఎం కేసీఆర్ మళ్లీ ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 5 రాష్ట్రాల ఎన్నికలు అనేవి అనేక పార్టీల రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…