Chiranjeevi Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా మెగాస్టార్ తన తరువాత చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవితోపాటు మరొక హీరో ఉండడంతో ఆ పాత్రలో నటించడానికి బాబీ.. రవితేజను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
రవితేజ అయితే ఈ మాస్ పాత్రలో బాగా సెట్ అవుతాడని చెప్పడంతో చిరంజీవి సినిమాలో రవితేజను తీసుకోవాలని భావించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే రవితేజ తప్పకుండా ఒప్పుకుంటారు. గతంలో రవితేజ నటించిన అన్నయ్య, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాలలో రవితేజ నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.