Chiranjeevi Pawan Kalyan : ఆరుపదుల వయస్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా తన 154వ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో మూవీ లాంచింగ్ కాగా, దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. పూరీ జగన్నాథ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
లాంచింగ్ తర్వాత చిత్రం నుండి పోస్టర్ విడుదల చేయగా, అందులో మాస్ అవతారంతో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేసేలా పోస్టర్‌ని సిద్ధం చేశారు. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఈ మూవీకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చిత్రంలో కీలక పాత్ర ఉండగా, ఆ పాత్రకి పవన్ కళ్యాణ్‌ని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామాలో చిరంజీవి వీరయ్య పాత్ర పోషిస్తుండగా, ఆయన సోదరుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్టు టాక్. ఈ చిత్ర దర్శకుడు బాబీ గతంలో పవన్‌తో కలిసి సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌ని కలిసి పాత్ర గురించి వివరించే ప్రయత్నం చేశాడట బాబీ. పాత్ర నచ్చడంతో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. ఇది కనుక నిజమైతే పవన్ అభిమానులకి పూనకాలే అని చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…