Chiranjeevi Old House : స్వయంకృషితో టాలీవుడ్ మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎందరికో స్పూర్తి. ఇప్పటికీ ఆయన స్పూర్తితో సినిమా పరిశ్రమలోకి చాలా మంది అడుగుపెడుతున్నారు. చిరంజీవి నటన, ఫైట్స్, డ్యాన్స్ చూసి మురిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి ఎన్నో మైలు రాళ్లను దాటుకొని ఈ స్థాయికి చేరారు. ప్రసుతం మెగా స్టార్ పేరు చెప్పితే ఒక పెద్ద సినీ కుటుంబమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం చిరంజీవికి పెద్ద పెద్ద బంగ్లాలు, బెంజి కార్లను తమ కుటుంబం మొత్తానికి కల్పించి ఉండవచ్చు. కానీ చిరంజీవి ఈ స్థాయికి రావడానికి చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన పడిన కష్టాలకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఇల్లు. ఈ ఇల్లు నెల్లూరు పట్టణంలో నేటికీ కూడా చెక్కు చెదరకుండా ఆనాటి చిరు జ్ఞాపకాలకు సజీవ సాక్షిగా నిలుస్తుంది.
చిరంజీవి తన విద్యాబ్యాసం మొత్తం ఇక్కడే పూర్తి చేసారు. డిగ్రీని పూర్తి చేసే సమయంలో చిరంజీవి తండ్రి కొణెదల వెంకట్రావు నెల్లూరు లో ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో సి.ఐ గా పని చేసేవారు . అప్పుడు వెంకట్రావు గారు ఈ ఇంటిలోనే ఉండేవారట. ఇక్కడే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ పెరిగారు. ఈ ఇంటి నుంచే చిరంజీవి సినీ ప్రయాణం ప్రారంభమయ్యింది. నెల్లూరు నుంచి 176 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్రాస్ కి అంటే ఇప్పటి చెన్నైకి చిరంజీవి ఈ ఇంటి నుంచే వెళ్లి వస్తూ ఉండేవారట. చిరంజీవి సినిమా ప్రయత్నాలు చేసేందుకు నెల్లూరు నుంచి నేషనల్ హైవే 16 మీదుగా మద్రాస్ కి వెళ్లేవారు.
ఒక్కోసారి తన తండ్రి దగ్గర ఉన్న బులెట్ పై చిరంజీవి మద్రాస్ కి వెళ్లేవారట. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలపై చిరుకి ఆసక్తి కలగటానికి ఈ ఇల్లే కారణమని చెప్పవచ్చు. నెల్లూరుకి మద్రాస్ అత్యంత దగ్గరగా ఉండటంతో ప్రతి పనికి మద్రాస్ కి ఎక్కువగా వెళ్లేవారు. ఆ సమయంలో సినీ పరిశ్రమ మొత్తం మద్రాస్ లోనే ఉండటంతో ఎక్కువగా సినీ రంగంలో నెల్లూరు వారే స్థిరపడ్డారు. అలాగే చిరంజీవి కూడా ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్లి సినిమాలపై ఆసక్తితో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ఆయన సినీ ప్రస్తానని పునాదిరాళ్లు చిత్రంతో మొదలుపెట్టారు. అది ఆ ఇంటికి ఉన్న చరిత్ర.
ఈ ఇంటిలో కొన్ని రోజుల క్రితం వరకు చిరంజీవి బాబాయి ఉండేవారు. ఆయన పిల్లలు విదేశాలలో స్థిరపడటంతో ఆయన కూడా అక్కడకు వెళ్లిపోవటంతో.. ఈ ఇంటిని చిరంజీవి కుటుంబసభ్యులు అమ్మేసారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన నెల్లూరు వాసి రూపురేఖలు మార్చకుండా అలానే ఉంచారు. ఎందుకంటే ఎంతైనా ఒక లెంజెండ్ హీరో నివసించిన ఇల్లు కాబట్టి. ఆ ఇంటిని కొత్తగా కొన్న యజమాని చిరంజీవి మీద అభిమానంతో అలానే ఉంచేశారు. అలానే ఉంచితేనే అది చిరంజీవికి ఇచ్చే గౌరవమని ప్రస్తుత ఇంటి యజమాని భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…