Chiranjeevi Net Worth : మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..

Chiranjeevi Net Worth : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్వ‌యం కృషితో ఎదిగిన స్టార్ హీరో ఎవ‌రు.. అంటే మ‌న‌కు మెగాస్టార్ చిరంజీవి పేరు ఠక్కున గుర్తుకు వ‌స్తుంది. ఆయ‌న ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స్టార్ డ‌మ్ సంపాదించారు. కొన్ని కోట్ల మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలుగా రాణిస్తున్నారు. ఇదంతా చిరంజీవి చ‌ల‌వే అని చెప్ప‌వ‌చ్చు. చిరంజీవి ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో లేరు. కానీ సినిమాల్లో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. ఏడాదికి ఒక‌టి క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన గాడ్ ఫాద‌ర్ మూవీ ఈ మ‌ధ్యే రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.

చిరంజీవి ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా ఉన్నారు. కరోనా నేప‌థ్యంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు ఆయ‌న ఇరు రాష్ట్రాల సీఎంల‌ను క‌లిసి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేలా చేశారు. ప్ర‌స్తుంత చిరంజీవి ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వాల్తేర్ వీర‌య్య‌, భోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే చిరంజీవికి సంబంధించిన అనేక విష‌యాలు ఇప్ప‌టికే చాలా మందికి తెలుసు. కానీ ఆయ‌న‌కు అస‌లు ఎంత ఆస్తి ఉంది అన్న వివ‌రాలు మాత్రం చాలా మందికి తెలియ‌వు. ఈ క్ర‌మంలోనే నెటిజన్లు ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసుకోవాల‌ని చూస్తున్నారు. ఈ మేర‌కు నెట్‌లోనూ సెర్చ్ చేస్తున్నారు. అయితే చిరంజీవికి సుమారుగా రూ.1000 కోట్ల‌కు పైగానే ఆస్తులు ఉన్న‌ట్లు స‌మాచారం.

Chiranjeevi Net Worth

చిరంజీవి అప్ప‌ట్లోనే భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారు. ఆయ‌న ద‌గ్గ‌ర అప్పట్లో ఉన్న కార్ల క‌లెక్ష‌న్ చూసి అంద‌రూ షాక‌య్యేవారు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న ఒక్కో మూవీకి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఆయ‌న అప్ప‌ట్లో ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్పుడు అఫిడ‌విట్‌లో త‌న‌కు రూ.33 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు తెలిపారు. అయితే ఇప్ప‌టికి ఆయ‌న ఆస్తులు ఇంకా భారీగా పెరిగి ఉంటాయ‌ని అంటున్నారు. ఆయ‌న ఆస్తి విలువ రూ.1000 కోట్ల‌కు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అప్ప‌ట్లో మా టీవీలో ఆయ‌న త‌న వాటాను విక్ర‌యించాకే భారీగా ఆస్తులు వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఇక ఇటీవ‌ల ఆచార్య మూవీ వ‌ల్ల తీవ్రంగా న‌ష్టాలు రావ‌డంతో చిరంజీవి త‌న రెమ్యున‌రేష‌న్‌ను వెన‌క్కి ఇచ్చేయ‌డంతోపాటు న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకు రూ.45 కోట్లు ఇచ్చార‌ని.. అందుకు గాను జూబ్లీహిల్స్‌లో త‌న ప్రాప‌ర్టీని అమ్మార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌ను స్థాపించి సినిమాల‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM