Chiranjeevi Navy Uniform Photo : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టారు. తన యాక్టింగ్, డ్యాన్స్‌తో అదరగొట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఇక ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. మొన్నా మధ్య ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి టిక్కెట్ల ధరలను పెంచుకునేలా చేశారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలకు భారీగా ఊరట లభించింది. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయస్సులో ఉన్నారు. అయినప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే చిరంజీవికి చెందిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే నేవీ డే సందర్భంగా తన సోషల్ ఖాతాలో ఓ పోస్ట్‌ను పెట్టారు. అందులో ఆయన ఫోటో ఉంది. అది ఆయన తన కాలేజీ రోజుల్లో తీసుకున్నది కావడం విశేషం. అందులో ఆయన నేవీ యూనిఫామ్‌లో ఉన్నారు. అయితే అది ఏదైనా సినిమాలోని ఫొటోనా అని చాలా మంది ఆరా తీశారు. కానీ వాస్తవానికి ఆ ఫొటో సినిమాలోనిది కాదు. నిజ జీవితంలో తీసుకున్నదే. అప్పట్లో ఆయన ఎన్‌సీసీ క్యాడెట్‌గా పనిచేశారు. ఆ సమయంలో తీసిందే ఆ ఫొటో. మొన్నా మధ్యనే గోవా ఎయిర్‌పోర్ట్‌లోనూ కొందరు నేవీ అధికారులను కలిసిన చిరంజీవి అప్పట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఇక 1976లో రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి ఉమ్మడి ఏపీలో రాజ్ భవన్ లో జరిగిన మార్చ్ ఫాస్ట్‌లోనూ పాల్గొన్నట్లు చిరంజీవి తెలియజేశారు. ఈ మధ్యే వైఎన్ఎం కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలోనూ చిరంజీవి పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తన పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. అయితే చిరంజీవి నేవీ డ్రెస్‌లో దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆ ఫొటో స్టోరీ ఏంటి.. అని అందరూ ఆరా తీస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…