Godfather : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఆచార్య ఫ్లాప్ అనంతరం ఈ మూవీ చిరుకు ఊరటనిచ్చింది. ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఖైదీ నందర్ 150 తరువాత మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి హిట్ కొట్టారని అంటున్నారు. ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించారు. అందువల్ల సినిమాకు కావల్సినంత హైప్ వచ్చింది. అయితే వాస్తవానికి సల్మాన్‌కు బదులుగా ఆ పాత్రకు ముందుగా పవన్ కల్యాణ్‌నే అనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు మోహన రాజా స్వయంగా వెల్లడించారు. అయితే ఆయన పవన్‌ను ఎందుకు తీసుకోలేదో కారణం వివరించారు.
గాడ్ ఫాదర్ మూవీలో మొదట సల్మాన్ పాత్రకు పవన్‌నే అనుకున్నారు. కానీ ఆచార్యలో చిరు, చరణ్ కలసి నటించారు. అది వర్కవుట్ అవ్వలేదు. అందువల్ల గాడ్ ఫాదర్‌లోనూ అలాగే చేస్తే.. చిరు ఫ్యామిలీకి చెందిన వ్యక్తినే తీసుకుంటే.. ఈ మూవీ రిజల్ట్ కూడా అలాగే ఉంటుందేమోనని భావించామని.. అందువల్ల చిరు ఫ్యామిలీకి చెందిన వ్యక్తులను ఈ మూవీలో తీసుకోవద్దని భావించామని.. పవన్‌ను అందుకనే తీసుకోలేదని తెలిపారు. అయితే ఆ పాత్రకు తాను ముందు నుంచి సల్మాన్‌ను అనుకుంటున్నానని.. కనుక పవన్‌పై దృష్టి పోలేదని కూడా వివరించారు.
ఇక మళయాళం సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మాతృక మూవీతో పోలిస్తే ఈ మూవీలో స్వల్ప మార్పులు చేశారు. వాస్తవానికి ఆ మార్పులు కూడా కలసి వచ్చాయని, సినిమాలో ఫోకస్ అంతా నలుగురు క్యారెక్టర్ల మీదే పెట్టామని మోహన్ రాజా వివరించారు. చిరు, నయన్, సత్యదేవ్, సల్మాన్.. పాత్రలపై ఫోకస్ బాగా పెట్టామని.. దాని వల్లే సినిమా బాగా వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే మోహన్ రాజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…