Koratala Siva : ఆచార్య సినిమా కొరటాల శివ కెరీర్ పై చాలా ప్రభావం చూపించింది. మంచి క్రేజ్ ఉన్న కమర్శియల్ డైరెక్టర్ గా ఇన్ని సంవత్సరాలలో ఆయన సంపాదించుకున్న పేరును ఒక్క దెబ్బతో పాతాళానికి పడిపోయేలా చేసింది. అయితే చిరంజీవి అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆయనపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఆయనను సోషల్ మీడియాలో ఏకి పారేస్తూనే ఉన్నారు. తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ విడుదలైన తరువాత కూడా చిరు అభిమానులు కొరటాల శివను వదలడం లేదు.
ఇక గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన మొదటి రోజునుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. దీంతో మెగా అభిమానులు పట్టరాని సంతోషంలో ఉన్నారు. సోషల్ మీడియాలో బాస్ ఈజ్ బ్యాక్ అని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో అభిమానులు ఆనందంలో తేలియాడుతున్నారు.
ఈ క్రమంలో కొందరు మళ్లీ కొరటాల శివను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మోహన్ రాజా చిన్న దర్శకుడు అయినప్పటికీ అభిమానులు ఏం కోరుకుంటున్నారో చిరంజీవిని అలాగే చూపించాడని కామెంట్ చేస్తున్నారు. ఆచార్య పేరుతో నువ్వు తీసింది సినిమా కాదు చెత్త అని కొరటాలను విమర్శిస్తున్నారు. మోహన్ రాజాను చూసి అయినా నువ్వు నేర్చుకోవాలని కొరటాల శివను ఉద్దేశించి కొందరు అభిమానులు ట్వీట్ చేశారు.
అయితే ఇప్పుడు కొరటాల కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. చిరంజీవి ఏ విధంగా అయితే గాడ్ ఫాదర్ తో తిరిగి వచ్చాడో కొరటాల కూడా అదే విధంగా ఎన్టీఆర్ తో తను తీయబోయే తదుపరి సినిమాతో బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమా తీసి తనను తాను నిరూపించుకోవాలని కొందరు ఆశిస్తున్నారు. దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషిస్తున్నారు. మరి కొరటాల ఏం చేస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…