Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. ఆయన సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక నటీనటులు అయితే ఆయన పక్కన నటించే చాన్స్ వస్తే బాగుండును.. అని కలలు కంటుంటారు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు చిరంజీవిని అన్నయ్యగా భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు హీరోలు ఆయన పక్కన తమ్ముళ్లుగా నటించి మెప్పించారు. వారిలో రవితేజ ఒకరు.
గతంలో రవితేజ చిరంజీవి పక్కన అన్నయ్య సినిమాలో ఆయన తమ్ముడిగా నటించారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవుతుందని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు రవితేజ కూడా హీరోగా పాపులర్ అయ్యాడు. దీంతో ఆయన చిరంజీవితో కలిసి నటిస్తే బొమ్మ దద్దరిల్లి పోతుందని భావిస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మూవీని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. అయితే ఈ మూవీలో చిరంజీవి పక్కన తమ్ముడిగా రవితేజ నటిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై దర్శకుడు బాబీ ఇప్పటికే రవితేజను సంప్రదించారట. అందుకు రవితేజ కూడా ఓకే చెప్పారట. దీంతో ఈ విషయాన్ని త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి, రవితేజ ఇద్దరికీ మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెగ ఉంది. ఈ నేపథ్యంలో వీరు తెరపై కలసి కనిపిస్తే.. సినిమా బంపర్ హిట్ అవడం గ్యారంటీ అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…