Chiranjeevi : చిరంజీవి, బాలకృష్ణ, రాధ వీరి ముగ్గురి జీవితంలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ల‌ వంటి వారు. ఇద్దరూ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. 1990వ‌ దశాబ్దంలో వీరి సినిమాల మధ్య ఎంతో పోటీ ఉండేది. ప్రేక్షకులు కూడా బాలయ్య మాస్ యాక్షన్ ని, చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ ని ఎంతో ఇష్టపడేవారు. ఎన్నో రకాల కొత్త కథాంశాలతో పోటాపోటీగా చిత్రాల్లో నటించేవారు. అభిమానుల్లో బాలయ్యకు, చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మనసుల‌ను దోచుకున్నారు.

ఇక వీరిద్దరి సినిమాల్లో కథానాయికగా నటించిన అందాల భామ హీరోయిన్ రాధ. ఈమె మలయాళీ అయినా, తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిరంజీవితో గుండా, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, కొండవీటి దొంగ, రాక్షసుడు, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం వంటి చిత్రాల్లో చిరంజీవికి ధీటుగా రాధ నటించింది. ఇక బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, రాముడు భీముడు, దొంగరాముడు, రక్తాభిషేకం వంటి చిత్రాలు ఎన్నో హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కెరీర్ ముగుస్తున్న దశలో రాజశేఖర్ అనే బిజినెస్న్ మ్యాన్ ని వివాహం చేసుకొని స్థిరపడింది.

Chiranjeevi

అసలు ఈ ముగ్గురు గురించి ఎందుకు చెబుతున్నారా అని ఆలోచిస్తున్నారా.. ఈ ముగ్గురు మధ్య ఓ ఆసక్తికర పోలిక వుంది. అదేమిటంటే చిరు, బాలయ్య ఇద్దరు పాలిటిక్స్ లో ఉండడం. ఇక ముగ్గురికి ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. చిరుకి సుస్మిత, శ్రీజ అనే ఇద్దరు అమ్మాయిలు, రామ్ చరణ్ అనే ఓ అబ్బాయి. బాలయ్యకు కూడా బ్రాహ్మణి, తేజస్విని అనే ఇద్దరు అమ్మాయిలు, మోక్షజ్ఞ అనే ఓ అబ్బాయి. అలాగే రాధకు కూడా ముగ్గురు పిల్లలే. అది కూడా ఈమెకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉండటం విశేషమే.

చిరు, బాలయ్య కూతుర్లు సినీ రంగానికి దూరంగా ఉండడం కూడా ఓ కామన్ పాయింట్. చిరు కుమారుడు రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా సినీ ఆరంగేట్రం చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఇది యాదృచ్ఛమే అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరికీ ఇద్దరేసి అమ్మాయిలు, ఒక్కో అబ్బాయి.  కానీ రాధ పెద్ద కూతురు కార్తీక తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలతో అందరిని ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెండో కూతురు తులసి కూడా తమిళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొడుకు విగ్నేష్ మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంటూ, తండ్రి బాటలోనే వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM