Ravindra Jadeja : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ జట్టును భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతంగా నడిపించాడు. చెన్నై పలు మార్లు ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసిందంటే అది ధోనీ ఘనతనే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. అలాగే ధోనీతోపాటు చెన్నై జట్టు విజయాల్లో ఇతర ప్లేయర్ల కృషి కూడా ఎంతో ఉంది. వారిలో రవీంద్ర జడేజా ఒకరు. జడేజా టీమ్‌కు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలను అందించాడు. కనుకనే ఎంతో మంది ప్లేయర్లు వచ్చి పోయినా చెన్నై జట్టులో అతనికి సుస్థిర స్థానం కూడా లభించింది.
ఇక తన ప్రదర్శనతోనూ ఆకట్టుకున్న జడేజా గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నైకి కెప్టెన్ అయ్యాడు. ఆ సీజన్‌కు ముందు ధోనీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో జడేజాకు ఆ చాన్స్ దక్కింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో చెన్నై దారుణమైన పరాజయాలను చవిచూసింది. దీంతో చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేదు. లీగ్ దశలోనే నిష్క్రమించింది. అలా జరగడానికి ఒకటి రెండు మ్యాచ్ ల ముందే జడేజా కెప్టెన్‌గా తప్పుకున్నాడు. అయితే జట్టు వరుసల ఓటములకు బాధ్యత వహించి జడేజా ఆ నిర్ణయం తీసుకున్నాడనుకున్నా.. ఇప్పుడు అతని వ్యవహార శైలి చూస్తుంటే చెన్నై జట్టుకు, ధోనీకి, జడేజాకు మధ్య చెడిందని.. కనుకనే జడేజా ఆ జట్టు నుంచి తప్పుకుంటున్నాడని అర్థమవుతోంది.
తాజాగా జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే చెన్నై జట్టు ఫొటోలు అన్నింటినీ తొలగించాడు. దీంతో వచ్చే సీజన్‌లో అతను చెన్నైకి ఆడబోవడం లేదనే విషయం మాత్రం స్పష్టమైంది. అయితే జడేజా ఇంత అనూహ్యంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దీని వెనుక ఒక బలమైన కారణమే ఉందని అంటున్నారు. జడేజాను పొమ్మనలేక పొగబెట్టారని, ధోనీతో అతనికి చెడిందని.. కనుకనే అతను అలా చేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే జడేజా మాత్రం మంచి ప్లేయర్ అని చెప్పవచ్చు. కెప్టెన్సీ విషయం పక్కన పెడితే జట్టును ఒంటి చేత్తో ముందుకు నడిపించగలడు. అంతటి సామర్థ్యం ఉంది. కానీ జడేజాను చెన్నై వదులుకునేందుకు సిద్ధమైందంటే.. ఏదో జరిగే ఉంటుందని చర్చించుకుంటున్నారు.
ఇక జడేజా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇంకో కారణాన్ని కూడా చెబుతున్నారు. ఒక వ్యక్తిని అసమర్థుడిగా నిరూపిస్తే అతని పట్ల ఏం చర్య తీసుకున్నా సమాజం పెద్దగా స్పందించదు. కనుకనే జడేజాకు ముందుగా కెప్టెన్సీ ఆశ చూపించి అందులో అతను విఫలం అయ్యాక ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకుంటున్నారని.. కనుకనే అది నచ్చని జడేజా చెన్నైతో కటీఫ్ చేసుకోబోతున్నాడని అంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. చెన్నై జట్టు ఒక మంచి ప్లేయర్ ను కోల్పోయి ఇంకా బలహీనంగా మారుతుందని మాత్రం అంటున్నారు. మరి వచ్చే సీజన్‌లో జడేజా ఏ జట్టుకు ఆడతాడో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…