Cashew Vs Almonds : మనం నిత్యం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడి తమ చేతులారా అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఏ ఆహారాన్ని తీసుకోవడం వలన మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. శరీరంలో ఎప్పుడైతే పోషకాహారలోపం ఏర్పడుతుందో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. మరి ఇలా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరానికి పోషకాలు ఉన్న ఆహారం అందించడం ఎంతో అవసరం.
మన శరీరానికి కావలసిన మంచి పోషకాలు అందించడంలో డ్రైఫ్రూట్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో నట్స్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా వాడేవి బాదం, జీడిపప్పు. ఈ రెండింటిలోనూ గ్లూటెన్ లేకుండా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర గింజలతో పోలిస్తే బాదంలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బాదం పప్పు బరువును తగ్గించడంలో సహకరిస్తుంది. బాదం పప్పును రెగ్యులర్ గా తినటం వలన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, మధుమేహ లక్షణాలు తగ్గించటానికి, మానసిక ఒత్తిడి తగ్గించటానికి సహకరిస్తుంది.
జీడిపప్పు తినటానికి రుచిగా ఉండటమే కాదు.. ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనిలో 82 శాతం కొవ్వుతోపాటు ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్ లో 66 శాతం గుండెకు రక్షణ కల్పించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. జీడిపప్పులో జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే ఐరన్ రక్త కణాలకు ఆక్సిజన్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తహీనతను నివారిస్తుంది. ఇక మెగ్నీషియం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అంతేకాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంతోపాటు కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇప్పుడు బాదం మరియు జీడిపప్పు రెండింటిలో ఏది తింటే బెటర్ అనేది చూద్దాం. బాదం పప్పు శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. బాదం పప్పులో అమైనో ఆమ్లాలు ఉండుట వలన వ్యాయమం చేసే సమయంలో కొవ్వులు మరియు క్యాలరీలు బర్న్ చేయటానికి సహాయపడుతుంది. జీడిపప్పులో విటమిన్ కె మరియు జింక్ అధికంగా ఉంటుంది. జీడిపప్పులో కొవ్వు తక్కువగా ఉంటుంది. జీడిపప్పు తినటం వలన బరువు తగ్గటం అనేది జరగదు.
బాదంలో ఫైబర్, విటమిన్ ఇ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు బాదం పప్పు తింటే బరువు తగ్గుతారు. ఈ విషయాలు కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడయ్యాయి. కాబట్టి జీడిపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ బరువు తగ్గాలని అనుకొనే వారు మాత్రం బాదం పప్పు తినటమే బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…