Business Idea : ఇటీవల దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. ఎంత ఉన్నత చదువులు చదివినా ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తుంది. దీంతో యువత ఒత్తిడికి గురవుతోంది. అందుకే.. ఉద్యోగం అంటూ దాని వెనుక పడే బదులు.. ఏదో ఒక బిజినెస్ చేసుకొని స్వయం ఉపాధి పొందడం చాలా బెటర్. కేవలం 5 వేల రూపాయలు పెట్టినా చాలు. కొంచెం కష్టపడితే నెలకు 2 లక్షల వరకు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఉంది.
ప్రస్తుతం అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి.. ఆ మొబైల్ కు అవసరమైన వాటిని మనం మార్కెట్ చేయడమే ఈ బిజినెస్ ఉద్దేశం. చాలామందికి ఫోన్ చార్జింగ్ చేయడానికి మొబైల్ చార్జర్ హోల్డర్ ఉండదు. చార్జింగ్ చేయాలంటే సాకెట్ పైన ఉండి.. చార్జర్ వైరు తక్కువగా ఉండటం వల్ల.. చాలామంది మొబైల్ ను సరిగ్గా చార్జింగ్ చేయలేక.. దాన్ని కిందికి వేలాడదీస్తారు. దాని వల్ల మొబైల్ తో పాటు చార్జర్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. బస్సుల్లో, బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్ పోర్టుల్లో మొబైల్ చార్జింగ్ పెట్టుకోవడం కోసం సాకెట్స్ పైన ఉంటాయి. కానీ మొబైల్ ను పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అటువంటి వాళ్ల కోసం వచ్చిందే మొబైల్ చార్జర్ హోల్డర్. ప్రస్తుతం మార్కెట్ లో ఇదే ట్రెండింగ్ ప్రొడక్ట్. ఈ బిజినెస్ ప్రస్తుతం బాగానే నడుస్తోంది. అమెజాన్, ప్లిఫ్ కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్ సైట్లలో ఒక మొబైల్ చార్జర్ హోల్డర్ ధర రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటుంది.
కానీ.. అదే మొబైల్ చార్జర్ హోల్డర్ ధర ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో 16 రూపాయలు ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో మొబైల్ చార్జర్ హోల్డర్లను బుక్ చేసుకొని.. వాటితోపాటు ప్యాకింగ్ కవర్స్ ను కూడా ఆర్డర్ చేసుకుంటే చాలు. ముందు రూ.5000తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి ఆర్డర్ డెలివరీ అయ్యాక.. వాటిని ప్యాక్ చేసుకొని.. ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో మన ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేసుకోవాలి. ఒక మొబైల్ చార్జర్ హోల్డర్ ధర.. ప్యాక్ చేసి కొరియర్ చేసినందుకు.. సుమారు 40 రూపాయలు అయినా.. దాన్ని 150 నుంచి 200 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. మరీ తక్కువలో తక్కువ రూ.100 అయినా అమ్ముకున్నా.. 60 రూపాయల వరకు లాభం వస్తుంది.
అంటే.. రోజుకు ఓ 100 అమ్మినా కూడా.. రూ.6000 లాభం వస్తుంది. అంటే నెలకు సుమారు రూ.1,80,000 వరకు సంపాదించవచ్చు. కస్టమర్లు అడ్రస్ పంపిస్తే.. వాళ్లకు ఆన్ లైన్ లో పేమెంట్ చేయాలని చెప్పి.. కొరియర్ ద్వారా ప్రొడక్ట్ పంపిస్తే చాలు. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం అని కస్టమర్ చెప్పినా.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొన్ని కొరియర్ కంపెనీలు ప్రొడక్ట్ ను డెలివరీ చేసి.. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి కంపెనీకి చెల్లిస్తాయి. ఒకవేళ ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ ను అమ్మాలనుకుంటే.. అమెజాన్, ప్లిఫ్ కార్టుల్లో సెల్లర్ గా మారి.. ఆన్ లైన్ లోనూ ఈ ప్రొడక్ట్ ను అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్ ద్వారా లాభానికి లాభం, ఒకరి దగ్గర పని చేయకుండా సొంతంగా సంపాదించుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…