Business Idea : ప్రస్తుత తరుణంలో చాలా మంది రైతులు సంప్రదాయ పంటలను కాకుండా భిన్న రకాలకు చెందిన పంటలను పండిస్తున్నారు. అందులో భాగంగానే మొక్కజొన్న, పత్తి, వరి, వేరుశనగకు బదులుగా ఇతర పంటలను పండిస్తూ లాభాలను గడిస్తున్నారు. అయితే ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి మద్దతు ధర లభించక చాలా నష్టపోతుంటారు. ఈ రకం పంటలను వేస్తే కనుక వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి పంటలను రైతులు పండించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక లాభదాయకమైన పంటల్లో లెమన్ గ్రాస్ ఒకటి. దీంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చు.
ఇక లాభదాయక పంటల్లో లెమన్ గ్రాస్ ఒకటని చెప్పవచ్చు. అనగా నిమ్మ గడ్డి.. ఈ నిమ్మగడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఫేషియల్ ప్రొడక్ట్స్, సోప్స్ తయారీలో ఈ ఆయిల్ ను ఉపయోగిస్తారు. ఇక ఈ గడ్డి అన్ని రకాల భూముల్లో పండుతుంది. ఇది పండించడానికి నీరు కూడా పెద్దగా అవసరం లేదు. ఈ నిమ్మగడ్డి పంటకు ఎరువులు కూడా పెద్దగా అవసరం లేదు. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే కనుక లక్షల రూపాయల్లో ఆదాయం వస్తుందని నిపుణులు కొందరు చెబుతున్నారు.
నిమ్మగడ్డి విత్తనాలు ఒక ఎకరాకు రెండు కిలోల వరకు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలను ఒక్కసారి నాటితే దాదాపు నాలుగేళ్ల వరకు పంట వస్తుంది. ఇక ఈ గడ్డిని నాటిన మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోసేయాలి. అలా పంట కూడా వెంటనే వస్తుంది. అలాగే గడ్డి నుంచి వచ్చే సువాసన కూడా బాగుంటుంది. ఇక ఈ గడ్డి నుంచి తీసిన నూనెకు ఒక లీటర్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉండటం విశేషం. ఎకరం భూమికి మార్కెట్ లో రేటును బట్టి సుమారు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. లెమన్ గ్రాస్‌ను ఒక ఎకరం భూమిలో పండించినా అద్భుతమైన లాభాలు వస్తాయి. కనుక స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పంటను పండించి ఆదాయం పొందవచ్చు. దీనికి మార్కెట్‌లో కూడా బాగానే డిమాండ్ ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…