Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత తన దృష్టిని పూర్తిగా తన కెరియర్ పై పెట్టింది. ఈ క్రమంలోనే వరుస సినిమా కథలను వింటూ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా ఈమె ఒప్పుకుంది. ఇలా తనకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టింది.
ఇక సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి అని చెప్పవచ్చు. కాగా సమంతతో ఎంతో సన్నిహితంగా ఉండే ఒక హీరోయిన్ ప్రొడక్షన్ లో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా ద్వారా సమంత బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైందని వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన తెలియజేయు నట్లు సమాచారం. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సమంత వరుస అవకాశాలు అందుకుంటూ తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందే.
అయితే నిన్న మొన్నటి వరకు సమంత విడాకుల బాధ నుంచి బయట పడేందుకు టూర్లు వేసింది. పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా సందర్శించింది. ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లడం లేదు. కనుక సినిమాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో పుష్ప మూవీ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాని తరువాత ఆమె బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఇదే నిజం అయితే ఆమె అభిమానులకు ఇంతకన్నా పెద్ద న్యూస్ ఏదీ ఉండదు. వారు నిజంగా పండగ చేసుకునే విషయం ఇది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…