Bimbisara : కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బింబిసార. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథిలాజికల్ టచ్‌తో సాగే ‘బింబిసార’ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులకి ఎంతగానో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే… ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యంమేలేసింది. అదే త్రిగర్దన సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం.. అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
బింబిసార చిత్రంలో క్యాథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కోవిడ్ రెండు సార్లు ప్రభావం చూపడం, గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో సినిమా మేకింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
బింబిసార చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్, చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తుండగా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇందులో కల్యాణ్‌రామ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా.. తెలుగుతోపాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…