నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా కొత్త దర్శకుడు అయిన మల్లిడి వశిష్టకు తన నిర్మాణ సంస్థ ద్వారా అవకాశం కల్పించారు కళ్యాణ్ రామ్.
వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రంగా బింబసార ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకుంది. సంక్షోభంతో సతమతమవుతున్న ఇండస్ట్రీని బింబిసార చిత్రం ఆదుకుందనే చెప్పవచ్చు. పటాస్ చిత్రం సక్సెస్ తర్వాత చాలా కాలం అనంతరం బింబిసార చిత్రంతో కళ్యాణ్ రామ్ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజునే రూ.6.30 కోట్ల షేర్ రాగా, రూ.9.30 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వీకెండ్ కావడంతో ఆదివారం కలెక్షన్ల జోరు మరింత పెరిగింది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల షేర్ ను, రూ.30 కోట్ల గ్రాస్ ను సంపాదించింది. బింబిసార కలెక్షన్స్ పరంగా ప్రాంతం వారీగా ఎంత షేర్ ని రాబట్టుకుందో ఒక్కసారి పరిశీలిస్తే..
యూఎస్ఏ రూ.1.00 కోటి, సీడెడ్ రూ.3.38 కోట్లు, వైజాగ్ రూ.2.26 కోట్లు, నైజం రూ.5.66 కోట్లు, నెల్లూరు రూ.50 లక్షలు, గుంటూరు రూ.1.27 కోట్లు, కృష్ణా జిల్లా రూ.88 లక్షలు, పశ్చిమ గోదావరి రూ.73 లక్షలు, తూర్పు గోదావరి రూ.1.02 కోట్లు, మిగిలిన ప్రాంతాలలో రూ.32 లక్షల షేర్ ను ఈ మూవీ రాబట్టుకుంది.