Priyanka Singh : బిగ్ బాస్‌లో పాల్గొని పాపులారిటీ సంపాదించిన ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గురించి బిగ్ బాస్ కన్నా ముందు చాలా మందికి తెలియదు. కానీ ఆ షోలో పాల్గొని అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. గతంలో జబర్దస్త్ షో ద్వారా కన్నా.. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ షో ద్వారానే ప్రియాంకకు పేరు బాగా వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈమె ప్రముఖ రచయిత కోన వెంకట్‌ను కలవగా.. త్వరలో ఈమెతో ఒక సినిమా చేస్తానని ఆయన ప్రకటించారు. దీంతో పింకీ గోల్డెన్ చాన్స్ కొట్టేసిందని చెప్పవచ్చు.

ఇక ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన విశేషాలను అందులో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు టచ్‌లో ఉంటోంది. అందులో భాగంగానే తాజాగా పలు వీడియోలను ఈమె పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఆమె అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోల పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
బిగ్ బాస్ షోలో మానస్‌తో కలిసి తిరిగిన ప్రియాంక షో అనంతరం పెద్దగా పట్టించుకోలేదు. బిగ్ బాస్ అందించిన స్క్రిప్ట్ ప్రకారమే వారు అలా చేశారనే టాక్ వచ్చింది. ఇక షో ముగిశాక కూడా ఈమె ఇతర కంటెస్టెంట్లను కలుస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తోంది.
View this post on Instagram