Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్షకులని బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ప్రాంతీయ భాషలలోనూ ఈ షో సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. తెలుగులోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన వెంటనే.. అదే స్టేజ్‌పై నుంచి బిగ్ బాస్ ఓటీటీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున.
మరో రెండు నెలల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. 24 గంటలూ ఏకధాటిగా ఈ షోని హాట్ స్టార్‌లో లైవ్ ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ షోని ఎవరు హోస్ట్ చేయనున్నారు, ఎవరు కంటెస్టెంట్ లుగా ఉంటారు అనే దానిపై జోరుగా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో ఓంకార్ చేతికి బిగ్ బాస్ ఓటీటీ పగ్గాలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. బుల్లితెరపై ఓంకార్ ఓ ట్రెండ్ సెట్టర్. ‘ఆట’, ‘సిక్స్త్ సెన్స్’, ‘ఇస్మార్ట్ జోడీ’, ‘మాయా ద్వీపం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో టీఆర్పీ రేటింగ్స్‌ని పెంచాడు.
తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షోకి సారథ్య బాధ్యతల్ని ఓంకార్ OAK ఎంటర్‌టైన్మెంట్స్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది. ఓంకార్ షో అంటే.. ఎలాగూ ఆయనే హోస్ట్ చేస్తారు కాబట్టి.. బిగ్ బాస్ హౌస్‌లో వన్ సెకండ్ అని ఓంకార్ మార్క్ చూపించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేసి పెట్టారట. సీజన్ 5 కంటెస్టెంట్స్‌గా చాలా మందికి ఫోన్లు వెళ్లాయి. చివరికి 19 మందిని ఫైనల్‌గా చేశారు. వారిలో ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చా, కత్తర్ పాప, యాంకర్ శివ, బంజారాహిల్స్ ప్రశాంత్, టిక్ టాక్ దుర్గారావు వంటి పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…