Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా పూర్తి కావడంతో త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీని ప్రారంభిస్తామని హోస్ట్ నాగార్జున అప్పట్లోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. కొందరు పాత కంటెస్టెంట్లతోపాటు కొందరు కొత్త కంటెస్టెంట్లను కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలో 4 మంది పాత కంటెస్టెంట్లను మళ్లీ తీసుకోనున్నారని సమాచారం. అరియానా, అఖిల్, తనీష్, ఆదర్శ్, అలీ రెజా, హరితేజ వంటి పాత కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
పాత కంటెస్టెంట్లతోపాటు కొత్తగా యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ఢీ10 విన్నర్ రాజు, టిక్‌టాక్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష తదితరులను కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివరాలపై స్పష్టత రావల్సి ఉంది. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.
కాగా బిగ్‌బాస్ ఓటీటీని 82 రోజుల పాటు ప్రసారం చేస్తారు. రోజుకు 24 గంటలూ లైవ్ లో షోను ప్రసారం చేస్తారు. దీంతో ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని నిర్వాహకులు విశ్వసిస్తున్నారు. ఇక ఈ వివరాలన్నింటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…