Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకనే నిర్వాహకులు బిగ్ బాస్ ఓటీటీని ప్లాన్ చేశారు. ఇక ఈ షో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఓటీటీ అని పేరు పెట్టారు కనుక ఈ బిగ్ బాస్ ఓటీటీ షో కేవలం ఓటీటీ యాప్‌లోనే ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ఈ షో స్ట్రీమ్ అవుతుంది.
ఇక బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోకు గాను ఇప్పటికే కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే వారు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపనున్నారు. ఇక కంటెస్టెంట్లలో ఇద్దరి పేర్లు కన్‌ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఒకరు తేజస్వి మడివాడ కాగా.. మరొకరు ముమైత్ ఖాన్. దీంతో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో రచ్చ రచ్చగా ఉంటుందని ఊహించవచ్చు.
అయితే షోను 12 వారాల పాటు కొనసాగించాలని అనుకున్నారట. కానీ కేవలం 6 వారాలు మాత్రమే కొనసాగుతుందని సమాచారం. ఇక ఈ షోను రోజుకు 24 గంటలూ లైవ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. అందువల్ల ప్రేక్షకులకు మరింత వినోదం లభిస్తుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తేజస్వి మడివాడ, ముమైత్ ఖాన్‌ల పేర్లు ఈ షోకు కన్‌ఫామ్ అయినట్లు తెలుస్తుండగా.. వారు ఇది వరకే టీవీలో వచ్చిన బిగ్ బాస్ సీజన్‌లలో పాల్గొన్నారు. దీంతో ఈసారి వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారు.. అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు వివాదాలు ఎక్కువగా నడిచాయి. షోలో అలాంటివి ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారని బిగ్ బాస్‌కు అర్థమైనట్లు కనిపిస్తోంది. అందుకనే ముమైత్‌ను ఈసారి ఆ అంశం కోసమే తీసుకున్నట్లు సమాచారం. మరి ఆమె ఈసారి షోలో ఎంతటి రచ్చ చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…