Bigg Boss : బిగ్‌బాస్ 6వ సీజన్ మొదలుపెట్టినప్పటి నుంచి నిర్వాహకులకు కష్టాలు తప్పడం లేదు. అసలే ఈ సీజన్‌కు రేటింగ్స్ లేక అల్లాడుతుంటే.. గోటి చుట్టు మీద రోకలి పోటు అన్నట్లుగా.. సీపీఐ నారాయణ లాంటి వారు షోపై దారుణమైన కామెంట్స్ చేయడం.. చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల బిగ్ బాస్ ప్రతిష్ట మసకబారుతుందనే చెప్పవచ్చు. ఇతర భాషల్లోనూ బిగ్ బాస్‌ను నిర్వహిస్తున్నారు. కానీ తెలుగులో మాత్రమే ఈ సీజన్‌కు దారుణమైన రేటింగ్స్ వస్తున్నాయి. అయితే ఇదలా ఉంచితే.. ఈ షోకు ప్రస్తుతం గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ షో నిలిచిపోతుందని అంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది.. అనే విషయానికి వస్తే..
బిగ్ బాస్ షోలో కంటెంట్ శృతి మించుతుందని.. అశ్లీలత బాగా పెరిగిపోయిందని.. అందువల్ల షో నిర్వాహకులపై, హోస్ట్ నాగార్జునపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో న్యాయవాది శివ ప్రసాద్ రెడ్డి పిటిషన్ వేశారు. దాన్ని విచారించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది. అంతేకాదు.. షోపై, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తమకు మరికాస్త గడువు కావాలని న్యాయవాది కోరడంతో కోర్టు ఈ కేసు విచారణను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజే తీర్పు ఇస్తామని చెప్పింది. అయితే బిగ్ బాస్ షోపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో షో భవిష్యత్తు ఏమవుతుంది.. కొనసాగిస్తారా.. నిషేధిస్తారా.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన ఏం జరుగుతుంది.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
వాస్తవానికి బిగ్ బాస్ షోపై గతంలో ఎన్నడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు. సీపీఐ నారాయణ కూడా గతంలో పలు మార్లు ఈ షోపై కామెంట్స్ చేశారు. కానీ ఈసారి మాత్రం కామెంట్స్ స్థాయి పెరిగింది. ఏకంగా అందులో ఉన్నవారు అందరూ వ్యభిచారం చేస్తున్నారని.. వారికి గుండు కొట్టించాలని, నాగార్జున డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి షోలను ఎలా ప్రోత్సహిస్తారు.. అని నారాయణ అన్నారు. దానికి నాగార్జున కూడా షోలోనే కౌంటర్ ఇచ్చారు.
అయితే రేటింగ్స్ పడిపోవడంతో.. మసాలాను దట్టించి రేటింగ్స్ పెంచుకునేందుకు యత్నిస్తున్నారని అర్థమవుతోంది. కనుకనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ అభాసు పాలవుతోంది. జనాలకు మెచ్చే విధంగా షోలో టాస్క్‌లను తీర్చిదిద్దితే బాగుంటుంది. అలా కాకుండా ఇలా మసాలాతో నెట్టుకొస్తాం.. అంటే.. ఇలాగే జరుగుతుంది. ఇక బిగ్ బాస్ భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…