Bigg Boss 5 : సోమవారం నామినేషన్స్ టెన్షన్, ఆదివారం ఎలిమినేష్ టెన్షన్. ప్రతి ఆదివారం ఒక్కో హౌజ్‌మేట్ ఎలిమినేట్ అవుతూ బయటకు వస్తుండగా, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పదోవారం నామినేషన్స్‌లో భాగంగా సిరి, సన్నీ, మానస్, రవి, కాజల్ ఈ ఐదురుగు నామినేట్ అయ్యారు. ఇందులో కాజల్‌కి తక్కువ ఓటింగ్ జరుగుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
దాదాపు కాజల్ ఈ వారం ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ ఊహించారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపి ఎలిమినేషన్స్ ఈ వారం ఎత్తేశారని అంటున్నారు.
వర్టిగో వ్యాధితో బాధపడుతున్న జెస్సీని సీక్రెట్ రూంలో పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు బిగ్ బాస్. డాక్టర్లు జెస్సీని మరోసారి పరీక్షించి మెరుగైన వైద్యం అందించాల్సి ఉందని.. హయ్యర్ కన్సల్టెన్సీ కోసం వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు.
జెస్సీ బయటకు వెళ్లడం వల్ల కాజల్ సేవ్ అయిందని, లేదంటే ఈ వారం తప్పక ఎలిమినేట్ అయ్యేదని జోస్యాలు చెబుతున్నారు. గతంలో జెస్సీ మాదిరిగా నూతన్ నాయుడు, గంగవ్వ, నోయల్ బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. జస్వంత్ ఎలిమినేషన్‌తో సిరి, షణ్ముఖ్ లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.