Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎంత రసవత్తరంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత సీజన్ కన్నా కూడా ఈ సీజన్‌లో నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ కాగా, అందులో ఐదుగురు మహిళా కంటెస్టెంట్సే కావడం విశేషం. ఈ వారం కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందని జోస్యాలు చెబుతున్నారు. ఇప్పటి వరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత ఇలా వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
ఇక ఏడో వారం నామినేషన్‌లో కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్, లోబో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నామినేషన్‌లో ఉన్న వారిలో కాజల్, రవి, ప్రియ, శ్రీరామ్ కాస్త స్ట్రాంగ్ కాగా, జస్వంత్, సిరీలకు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనీమాస్టర్, లోబోలకు మాత్రమే కాస్త తక్కువ ఫాలోయింగ్ ఉంది.
సిరిని ఈ వారం సేవ్ చేస్తే అనీ మాస్టర్, లోబోలలో ఒకరు బయటకు రావడం ఖాయం. ఈ వారం లోబో పెద్దగా గేమ్ ఆడలేదు కాబట్టి అనీ మాస్టర్‌ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. ఒక వేళ సిరి ఎలిమినేట్ అయితే మోజ్ రూమ్ బ్యాచ్ లో ఒకరు తగ్గనున్నారు. దీంతో గేమ్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏది ఏమైనా ఈ వారం హౌజ్ నుండి మహిళా కంటెస్టెంట్ బయటకు రావడం ఖాయం అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…