Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో సిరి ఒకరు. గేమ్ పరంగా బాగానే ఆడుతున్నా కానీ షణ్ముఖ్ తో ఆమె ప్రవర్తించే తీరే వివాదాస్పదంగా మారుతోంది. ప్రతిసారి హగ్గులు ఇవ్వడం, మీద మీద పడడం విమర్శల పాలయ్యేలా చేసింది. రీసెంట్‌గా ఇంట్లోకి వచ్చిన సిరి తల్లి హగ్గులు ఇవ్వడం నచ్చలేదంటూ డైరెక్ట్‌గా చెప్పడంతో సిరి, షణ్ముఖ్‌ల ఫేస్ మాడిపోయింది. అయితే సిరి ప్రియుడు శ్రీహాన్ మాత్రం ఆమెకు సపోర్ట్‌గా ఉంటూనే ఉన్నాడు.

శ్రీహాన్‌ని స్టేజ్ మీద చూడగానే సిరి ముఖం చెల్లలేదు.. భోరున ఏడుస్తూ పశ్చాత్తాపపడింది. ఏమైంది సిరీ.. అని అడుగుతూ.. సృజనా వదిలేస్తున్నావా ? అంటూ సిరిని సూటిగానే అడిగేశాడు శ్రీహాన్. ఆ మాటతో సిరి.. కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా శ్రీహాన్‌కి క్షమాపణ చెబుతూ సిగ్గుతో గుంజీలు తీసింది. సిరి గుంజీలు తీస్తుంటే.. దేనికే ఏయ్ సిరి అని ఆపిన శ్రీహాన్.. గేమ్ బాగా ఆడు.. ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు.. నేను నిన్ను అర్ధం చేసుకున్నా.. అని చెబుతాడు.
నువ్ బయటకు రావాలనుకుంటే డోర్స్ ఉన్నాయి వాటిని ఓపెన్ చేస్తారు.. అంతే కానీ.. బాత్ రూంలోకి వెళ్లి గోడల్ని ఎందుకు బద్దలు కొడుతున్నావ్. మైండ్‌లో నుంచి పిచ్చి పిచ్చి థాట్స్ తీసెయ్. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా.. అని చెప్పాడు. ఆ తరువాత శ్రీహాన్ ఎమోషనల్ అయ్యి సిరికి అర్థమయ్యేట్టుగా గుండెలని పిండే పాట ఒకటి పాడి తన బాధను వ్యక్తపరిచాడు. ఆ పాట విని సిరి ఏడ్చేసింది.
తరువాత మానస్-ప్రియాంక మధ్య జరిగే డిస్కషన్స్‌ని ఇమిటేట్ చేసి చూపించి తెగ నవ్వించాడు శ్రీహాన్. చివరి పంచ్‌గా అందరూ గేమ్ బాగా ఆడండి. మీలో మీరు కొట్టుకోండి, కానీ మమ్మల్ని ఎంటర్ టైన్ చేయండి అని చెప్పాడు. అయితే చివర్లో సిరిని సేవ్ చేయడంలో భాగంగా.. కవర్ శ్రీహాన్ చేతికి ఇచ్చారు నాగార్జున. ఆ కవర్ తెరిచి సిరి సేఫ్ అయ్యిందో అన్ సేఫ్ అయ్యిందో శ్రీహాన్ చెప్తాడు.. సిరి భవిష్యత్ శ్రీహాన్ చేతిలో ఉందని నాగార్జున చెప్పగా.. ఆ మాటకు సిరి.. లేదు సార్, నా భవిష్యత్ నా చేతిలోనే ఉందని.. కాస్త యాటిట్యూడ్ ప్రదర్శించింది.