Bigg Boss 5 : టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రజంట్ సీజన్ 5 సూపర్ స్పీడ్ గా రన్ అవుతున్న ప్రోగ్రామ్. టాప్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా షణ్ముఖ్ ఉన్నాడు. అతను బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన కొత్తలో చాలా తక్కువగా కనిపించాడు. అలాగే గేమ్స్ మీద కూడా ఫోకస్ చేయలేదు. కానీ రాను రాను నాగార్జున.. షణ్ముఖ్ ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసి బూస్టప్ ఇచ్చారు. అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో చాలా స్లోగా ఉండటమే కాకుండా ఆడియన్స్ దృష్టిలో సోమరితనంగా బిహేవ్ చేస్తున్నాడనే ఫీలింగ్ ని తెప్పించాడు. ఇక అతని ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టి అనవసరమైన విషయాలపై డిస్కషన్స్ చేయడంలో మాత్రం బ్రహ్మను తలపించాడంటూ.. షణ్ముఖ్‌ని, నాగార్జున బ్రహ్మ అని పిలిచారు.
కానీ లేటెస్ట్ గా జరుగుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో షణ్ముఖ్ ఆటని చూస్తున్న ప్రేక్షకులకే కాకుండా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కూడా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే షణ్ముఖ్ కొన్ని సిచువేషన్స్ లో లూజ్ టాక్ తో తన ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నాడు. దీంతో సోషల్ మీడియాలో కూడా షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎక్కడ ఎలిమినేట్ అవుతాడనే విషయంలో టెన్షన్ పడుతున్నారు. లాస్ట్ ఎపిసోడ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత సిరితో ఓ సాంగ్ చేయడానికి అడిగినప్పుడు చాలా సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఈ విషయంలో సిరిపై గొడవ పడినా.. ఆ తర్వాత సారీ చెప్పి గొడవను సర్థుబాటు చేసుకున్నాడు.
కాకపోతే ఇలాంటి బిహేవియర్ తో షణ్ణుకు ఓట్లేమైనా తక్కువ పడతాయా అనేది ఆలోచించాలని అంటున్నారు అభిమానులు. షణ్ముఖ్ యూట్యూబ్ లో తన కవర్ సాంగ్స్ , వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయ్యాడు. సో ఆ పాయింట్ లోనే హౌస్ మేట్స్ కవర్ సాంగ్స్ చేయాలని అడిగారు. అందులో తప్పేం లేదు. కానీ షణ్ముఖ్ మాత్రం కాస్త ఎక్కువగానే ఫీల్ అయినట్లు అనిపించింది. సెటైర్లు వేసే బదులు ఒకే తర్వాత చూద్దాం అని కూడా స్కిప్ చేయొచ్చు. లేదంటే అంత హైపర్ గా రియాక్ట్ అయితే అతనికే ఇబ్బంది అనే విషయంలో షణ్ముఖ్ కాస్త క్లారిటీ తెచ్చుకుంటే బెటర్. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…