Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్స్ అంతా ఓ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అందిస్తున్నారు. అలాగే షణ్ముఖ్ కి కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. మొదటి నుండి తన బిహేవియర్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాడు. గేమ్ ఆడినా.. ఆడకపోయినా.. షణ్నుకి ఉన్న క్రేజ్ మాత్ర పీక్స్ కి చేరుకుంది. అలాగే గత వారాల్లో షణ్ముఖ్ తన గేమ్ స్టైల్ చూపించి తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్ లో విన్నర్ గా నిలిచి వావ్ అనిపించుకున్నాడు.
అంతేకాకుండా ఆ వారం మొత్తం కెప్టెన్ షణ్ను హవానే నడిచింది. ఒక్కసారి నాయకుడైతే ఆ ఫీలింగే వేరబ్బా అనుకున్నాడో ఏమో.. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి బిగ్ బాస్ కెప్టెన్ గా నిలవాలని బలంగా అనుకుంటున్నాడు. అందుకే ఈరోజు ప్రారంభం అవ్వబోయే కెప్టెన్సీ టాస్క్ లో షణ్ను పర్ఫార్మెన్స్ కాస్త టఫ్ గానే నిలవనుంది. అందుకే ఈ వారం కెప్టెన్ గా షణ్ముఖ్ నిలుస్తాడని అంచనా వేస్తున్నారు నెటిజన్లు.
ఈసారి కనుక ఈ వార్త నిజమైతే హౌస్ లో షణ్ను హవా మరోసారి ఆడియన్స్ తోపాటు ఇంటి సభ్యులకు కూడా చూపిస్తాడన్నమాట. ప్రస్తుతం బిగ్ బాస్ కెప్టెన్ గా మానస్ కంటిన్యూ అవుతున్నాడు. రీసెంట్ గా ఇంటి నుండి అనీమాస్టర్ బయటకు వచ్చేశాడు. తాజాగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా హీట్ డిస్కషన్ జరిగింది.