Bigg Boss 5 : బిగ్ బాస్ రియాలిటీ షో నుండి రీసెంట్ ఎపిసోడ్ లో అనీ మాస్టర్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అనీ మాస్టర్ చాలా కోపంగా మాట్లాడింది. ఇక కాజల్ విషయంలో తనను ఇష్టం వచ్చినట్లు విమర్శించడంతో తట్టుకోలేకపోయింది. తనతో ఆప్యాయంగా మెలుగుతూ తన తమ్ముడిగా భావించే రవి భార్య నిత్యకు టార్చర్ తప్పటం లేదని అనీ మాస్టర్ ఫైర్ అయ్యింది. గేమ్ ని గేమ్ లాగే చూడాలంటూ.. పర్సనల్ గా తీసుకోకూడదని సూచించింది.
దీంతో ఇన్ స్టా స్టోరీస్ లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక.. సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ అన్నింటినీ చూస్తున్నానని.. మీరు మొదటి నుండి ఇప్పటివరకు జరిగిన 11 వారాల బిగ్ బాస్ ను చూడడం లేదా.. మీరు ఒకరికే ఫాలోవర్ కావచ్చు, వారికే ఫ్యాన్ కావచ్చు కానీ ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డాన్స్ చేసి వెక్కిరిస్తున్నానంటూ బాగా హైలెట్ చేస్తున్నారని మండి పడింది. ఇక ఆ ఒకరిని అమ్మేస్తాను అనడం మాత్రం తప్పు కాదు కదా అంటూ ఫైర్ అయ్యింది.
ఇంకో విషయం ఏంటంటే.. తాను రవి భార్య నిత్యతో మాట్లాడానని, ఆమె కూతురు వియూ వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్ళ చిన్న పాప మీద ఈ బ్యాడ్ కామెంట్స్ ఏంటి, ఇది అస్సలు కరెక్ట్ కాదని, మేమంటే భరిస్తామని, కానీ చిన్న పిల్లల వీడియోస్ కి ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారని ప్రశ్నించింది.
అంత చిన్నపాప మీద ఎందుకు ద్వేషం, అసలు నాకు బుద్ది లేదా.. మీకు బుద్ది లేదా.. వియు వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ చేయడం ఇప్పటికైనా ఆపండి.. అంటూ వార్నింగ్ ఇచ్చింది అనీ మాస్టర్.