Aryan Khan : క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలతో నమోదు అయిన కేసు విషయమై గత 20 రోజులుగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది. ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆర్యన్ శుక్రవారం జైలు నుంచి విడుదల కానున్నాడు.
అయితే ఆర్యన్‌ఖాన్ ఇదివరకే పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఎన్‌సీబీ ప్రవేశపెట్టిన సాక్ష్యాలు పకడ్బందీగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీంతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఎంటరయ్యారు. ఆయన గత రెండు, మూడు రోజుల నుంచి బాంబే హైకోర్టుకు వచ్చారు. ఆర్యన్ తరఫున వాదించారు. ఈ క్రమంలో ఆర్యన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడం విశేషం.
ఆర్యన్ జైలులో ఉండడంతో షారూఖ్ కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు భోజనం కూడా సరిగ్గా చేయడం లేదని వార్తలు వచ్చాయి. మరోవైపు షారూఖ్, ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లినప్పుడల్లా వారిని చూసి ఆర్యన్ కన్నీటి పర్యంతమయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. జైలులో ఇచ్చే ఆహారాన్ని ఆర్యన్ తినలేదని, తండ్రి ఇచ్చిన రూ.2వేలతో బిస్కెట్లను కొని తింటూ నీళ్లు తాగాడని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆర్యన్ బెయిల్‌పై శుక్రవారం విడుదల కానుండడంతో అతని ఇంట్లో సంతోషాలు నెలకొన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…