Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం.. భీమ్లా నాయక్. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి రానా మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భీమ్లానాయక్‌లో నిత్యామీనన్ పవన్ సరసన నటిస్తోంది.
భీమ్లానాయక్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా విడుదలైన అడవి తల్లి మాట అనే పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ఎన్నో లక్షల మంది ఈ పాటను వీక్షించారు.
ఈ పాటను ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి పాడారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే అసలు ఈ దుర్గవ్వ ఎవరు.. అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
కాగా దుర్గవ్వ మంచిర్యాల జిల్లా వాసి. పెద్దగా ఏమీ చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది. దుర్గవ్వ కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ అనేక పాటలు పాడారు.
తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే.. అనే పాట లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతోంది. దీంతోపాటు సిరిసిల్లా చిన్నది లాంటి పాపులర్ పాటలను ఆమె పాడి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో దుర్గవ్వ పాడిన అడవి తల్లి మాట.. అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…