Bangarraju Movie : కరోనా నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలను వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తారనుకున్న ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ మూవీలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత 2 రోజులుగా సంక్రాంతి బరిలో ఉంటున్న మూవీల జాబితా తగ్గుతూ వస్తోంది. అయితే కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీని మాత్రం సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించారు.
కరోనా నేపథ్యంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి కనుక బంగార్రాజు మూవీని కూడా వాయిదా వేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని జనవరి 14న అంటే సంక్రాంతి రోజున విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. దీంతో ప్రేక్షకులు కొంత వరకు రిలీఫ్ ఫీలవుతున్నారు.
తాము ఎంతో ఆశగా ఎదురు చూసిన భారీ బడ్జెట్ మూవీల విడుదల లేకపోయినా.. నాగార్జున సినిమా అంటే.. మినిమం ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ కనుక ప్రేక్షకులు కొంత వరకు ఊరట చెందుతున్నారు. అయినప్పటికీ భారీ బడ్జెట్ మూవీలు ఇప్పుడప్పుడే విడుదల కావడం లేదు కనుక ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు.
ఇక బంగార్రాజు మూవీలో నాగ్ సరసన రమ్య కృష్ణ నటించగా.. చైతూ పక్కన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 2016 సంక్రాంతి బరిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ భారీ హిట్ సాధించింది. దీంతో 2022లోనూ బంగార్రాజు అదే మ్యాజిక్ చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…