Shruti Haasan : జల్సా చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ దర్శకనిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమాకు ముందు శృతిహాసన్ సైతం వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.
ఈ చిత్రంతో శృతి హసన్ లక్ మారిపోయింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శృతిహాసన్ గబ్బర్ సింగ్ తో మంచి విజయం అందుకుంది. చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ముందుగా శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ముందుగా శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని, కాబట్టి హీరోయిన్ గా ఆమెను తప్పించే ఆలోచన చేసినట్టు తెలిపారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వెళ్లి చెప్పగా.. నువ్వు అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రమే తీశావా అంటూ తనపై పంచ్ వేశారని ఆ తర్వాత శృతినే సినిమాలో కంటిన్యూ అయిందని బండ్లగణేష్ వెల్లడించారు.
ఇక ఈ చిత్రం సక్సెస్ తో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ రేసుగుర్రం, బలుపు, ఎవడు, శ్రీమంతుడు వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. గబ్బర్ సింగ్ చిత్రంతో అప్పటివరకు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఆ తర్వాత హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో, బాలకృష్ణ NBK107 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ శృతిహాసన్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…