Bandla Ganesh : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లైగర్. ఫస్ట్ డేనే మూవీ ఆడియెన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ తప్ప.. సినిమాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ లేదని, పూరీ మార్క్ అసలే లేదని ఆడియెన్స్ అంటున్నారు. పూరీ ఇంతలా డిజపాయింట్ చేస్తారని ఊహించలేదని ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారు. పూరీ కెరీర్లో లైగర్ డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.
ఇడియట్, పోకిరి లాంటి మాస్ మూవీస్ తీసిన పూరీ ఇతనేనా అని ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది కానీ ప్రమోషన్స్ లో పూరీ బ్యాచ్ చేసిన అతి వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిని ఏకిపారేస్తున్నారు. విజయ్, ఛార్మి, పూరీ ఇలా ఎవరిని వదలకుండా ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంకొందరైతే పూరీ జగన్నాథ్ గతంలో చేసిన తప్పులను బయటకు తవ్వుతున్నారు. ఆ పాపమే నీ పాలిట శాపంగా మారింది అంటూ పుండు మీద కారం చల్లినట్టు ఇంకా రెచ్చగొడుతున్నారు. వాటిల్లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆ మధ్య పూరీ కొడుకు ఆకాష్ పూరీ చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు అన్నా.. కానీ వదినమ్మ నీకు శాశ్వతం.. నీకోసం వదినమ్మ పడిన బాధలు ఎన్నో నాకు తెలుసు. నీ కొడుకు ఫంక్షన్ కి రాలేనంత బిజీ అయిపోయావా నువ్వు ? ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్ అంతే.. వేరే పేరు రాస్తే తంతారు. పవిత్రను, ఆకాష్ ను బాగా సెటిల్ చెయ్యి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్.
పూరీ జగన్నాథ్ భార్యను గతంలో ఏడిపించాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనాడు పడిన బాధలు ఈనాడు ఛార్మి, పూరీ పాలిట శాపంగా మారాయని.. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ తో అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరికొందరు.. అసలే సినిమా ఫ్లాప్ అయిన బాధలో ఉన్నాడు.. మీరు ఇంకా బాధ పెట్టకండ్రా బాబు.. అంటూ కూల్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…