Bandla Ganesh : బండ్ల గణేష్.. ఒక నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా అందరికీ తెలుసు. కానీ ఈయన గత కొంత కాలంగా హీరో పవన్ కళ్యాణ్ అపర భక్తుడిగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తనని తాను పవన్ వీరాభిమానిగా చెప్పుకుంటూ ఉంటాడు. వివిధ వేడుకల్లో అవకాశం దొరికినప్పుడల్లా తన విచిత్రమైన మాటలతో, హావ భావాలతో ప్రసంగిస్తూ, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని తరచూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. ఇక ఈయన పవన్ కళ్యాణ్ తో చివరగా గబ్బర్ సింగ్ సినిమాని నిర్మించాడు. ఇది అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే చాలా రోజులుగా పవన్ అభిమానులు బండ్ల గణేష్ ని తమ హీరో పవన్ కళ్యాణ్ తో తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు తీస్తారని సమయం వచ్చినప్పుడల్లా అడుగుతూ వస్తున్నారు. ఇప్పుడిక ఇదే ప్రశ్నని ఒక పవన్ అభిమాని ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ని అడగడం జరిగింది. దానికి ఆయన ఆ అభిమానికి నీతి సూక్తులు బోధించగా అవి కాస్తా ఇప్పుడు పవన్ అభిమానులకి కోపం తెప్పించేలా ఉన్నాయి. వారు ఈ విషయంలో ఆయనపై మండి పడుతున్నారు.
బండ్ల గణేష్ ఆ అభిమాని ట్వీట్ కి బదులిస్తూ.. మనం నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులం అయితే సినిమాలంటూ వెంటపడి ఆయనని డిస్టర్బ్ చేయకూడదని, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో అది చేయనివ్వాలని అన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్థాయి వేరని, ఎంతో భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పాడు. ఇక బండ్ల గణేష్ చెప్పిన ఈ మాటలు అర్థం లేనివని పవన్ అభిమానులు ఆయనపై విరుచుకు పడుతున్నారు.
అయితే ఆ అభిమాని బండ్ల గణేష్ ట్వీట్ కి బదులుగా పవన్ కళ్యాణ్ తో నెక్ట్స్ మూవీ ఎప్పడు చేస్తావ్ అని అడిగితే ఏవో విషయాలు చెప్పడం ఏంటని, తమ హీరోతో సినిమా చేస్తా అని గానీ చేయను అని కానీ ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా, అవసరం లేని నీతి సూక్తులు ఎందుకు చెబుతున్నావ్.. అని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇప్పటికైనా బండ్ల తన తీరుని మార్చుకుంటాడో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…