Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా అదరగొడుతున్నారు. డిజిటల్ మీడియాలో అన్‌స్టాపబుల్ అనే షోతో రికార్డులు కొల్లగొడుతున్న బాలయ్య ఇప్పుడు అఖండ సినిమాతో వెండితెర రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య గురించిన చర్చే నడుస్తోంది. ఆయనకు సంబంధించి పలు విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. బాలకృష్ణ విగ్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.
బాలకృష్ణ తన సినిమాల్లో విగ్గులు ఉపయోగిస్తుంటారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కో విగ్గు ఉంటుంది. కొన్ని సినిమాల్లో చాలా అందమైన తలకట్టు ఉన్న విగ్గులుంటే, కొన్నింటిలో ఆయన హెయిర్ స్టైల్ నచ్చక ట్రోల్ చేసిన వారు కూడా ఉన్నారు. అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి అఖండ పాత్ర, మరో పాత్ర మురళీ కృష్ణ రోల్. అఘోరాగా కనిపించిన అఖండ పాత్రకు ఎలాంటి హెయిర్ స్టైల్ అవసరం లేకుండా పోయింది.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే మురళీ కృష్ణ పాత్ర లుక్ చూడగానే ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దాదాపు పదమూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్గు చేయించాడట బోయపాటి. సినిమా మొత్తం మీద మూడు విగ్గులు ఉపయోగించారు. అంటే విగ్గుల కోసం దాదాపు నలబై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక ఆ విగ్గుల మెయిన్‌టెయినెన్స్ కోసం మరో పది లక్షలు ఖర్చు అయ్యాయట. అంటే మొత్తంగా అరకోటి రూపాయలను బాలకృష్ణ విగ్గులకే ఖర్చు పెట్టారట. ఇవన్నీఇప్పుడు వచ్చేశాయనుకోండి. అలా వసూళ్లు వస్తాయి కాబట్టే ఇలాంటి చిన్న విషయాలకు కూడా సినిమా వాళ్లు పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తుంటారు.