Balakrishna : నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు నందమూరి ఫ్యామిలీ వేడుకల్లో.. ఇతర కార్యక్రమాల్లో మోక్షజ్ఞ కనిపిస్తూ ఫ్యాన్స్‌కు జోష్ తెప్పిస్తున్నాడు. అయితే మోక్షజ్ఞ లుక్ ఒక్కటే ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. గతంలో ఎంతో లావుగా ఉండే మోక్షజ్ఞ ఈమధ్య కాస్త బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా లావుగానే ఉన్నాడు. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా.. అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి.
మోక్షజ్ఞను అతి త్వరలోనే వెండితెరకు పరిచయం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక బి.గోపాల్, పూరీ జగన్నాథ్, వినాయక్, అనిల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు కూడా బాగానే వినిపించాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై క్లారిటీ లేదు. ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తాను మోక్షజ్ఞను డైరెక్ట్ చేయడం లేదని.. బాలకృష్ణ తనకు ఈ విషయంపై ఇంకా ఏమీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇంకో వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని మళ్లీ ప్రచారం జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన తండ్రి నందమూరి తారకరామారావు 100వ జయంతి సందర్భంగా బసవతారక రామ క్రియేషన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తమ సొంత బ్యానర్‌లోనే ఓ మూవీని నిర్మించాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నారట. ఇక ఆ మూవీ ద్వారా మోక్షజ్ఞను తెలుగు తెరకు పరిచయం చేయాలని చూస్తున్నారట. ఇంకా చెప్పాలంటే బాలకృష్ణనే స్వయంగా మోక్షజ్ఞ సినిమాకు దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ఫ్యాన్స్‌కు అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకొకటి ఉండదు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలే. వీటిలో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…