Mokshagna : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎవరు అంటే తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ పేర్లే మొదటిగా గుర్తుకొస్తాయి. ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయుడు నాగ చైతన్య స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు.
అయితే గత కొంతకాలం నుంచి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కాని నందమూరి అభిమానులు కల మాత్రం నిజం కావడం లేదు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారని పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు ఆ వార్త పై స్పందించారు. గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు.

గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల అఖండ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి సందడి చేశారు. ఇక తన కుమారుడు మోక్షజ్ఞని వచ్చే ఏడాది టాలీవుడ్లోకి పరిచయం చేయనున్నట్లు బాలయ్య బాబు వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య బాబు ప్రస్తావించలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను హీరోగా పరిచయం చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలయ్య మాట్లాడుతూ.. అంతా దైవేచ్ఛ అని నవ్వి ఊరుకున్నారు. ఇలా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య బాబు క్లారిటీ ఇచ్చేశారు.
ఇక అనంతరం అఖండ-2 పై కూడా స్పందించారు. అఖండ-2 కచ్చితంగా ఉంటుంది. అఖండ-2 కావలసిన సబ్జెక్ట్ కూడా సిద్ధం. ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసిప్రకటిస్తాం అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.