Asia Cup 2022 : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఈ కప్‌ను నిర్వహించారు. ఇది 15వది కాగా ఈసారి టోర్నీని షార్జాలో నిర్వహిస్తున్నారు. చివరిసారిగా 1984లో ఈ నగరం ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆసియా కప్ ను ఈసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం రెండో సారి కావడం విశేషం. ఇక ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
ఈ టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్, హాంగ్ కాంగ్ జట్లు గ్రూప్ ఎ లో తలపడతాయి. అదేవిధంగా ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు గ్రూప్ బిలో పోటీ పడతాయి. షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 27వ తేదీన ప్రారంభం అయ్యే ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 11వ తేదీన ముగుస్తుంది. అదే రోజు టోర్నీ ఫైనల్‌ను నిర్వహిస్తారు.
ఆసియా కప్ 2022లో భాగంగా అన్ని మ్యాచ్‌లను రాత్రి 7.30 గంటలకు భారత కాలమానం ప్రకారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా లీగ్ దశలో భారత్ పాకిస్థాన్, హాంగ్ కాంగ్‌లతో ఆడుతుంది. మొదటి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆగస్టు 28వ తేదీన ఆదివారం జరగనుండగా.. హాంగ్‌కాంగ్‌తో ఆగస్టు 31వ తేదీన భారత్ రెండో మ్యాచ్‌ను ఆడనుంది. తరువాత మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
ఇక భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లు స్టాండ్ బై ప్లేయర్లుగా ఉండనున్నారు. ఇక క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో వీక్షించవచ్చు. అదే ఆన్ లైన్‌లో అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మ్యాచ్‌లను వీక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు యప్ టీవీ ద్వారా ఈ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…